ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత
Sakshi Education
ప్రముఖ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్,పిల్లలు రిద్దిమా కపూర్, రణ్‌భీర్ కపూర్ ఉన్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన రిషీకపూర్ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ నటుడు కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : రిషీకపూర్ (67)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : క్యాన్సర్ వ్యాధితో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ నటుడు కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : రిషీకపూర్ (67)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : క్యాన్సర్ వ్యాధితో
Published date : 30 Apr 2020 07:11PM