Skip to main content

ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలకంటి ఇకలేరు

ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ (64) గుండెపోటుతో జనవరి 5న చెన్నైలో కన్నుమూశారు.
Current Affairs
1957, నవంబర్ 30న నెల్లూరులో జన్మించిన వెన్నెలకంటి... సినీ వినీలాకాశంలో మాటల, పాటల రచయితగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 11 ఏళ్ళకే కవితలు, పద్యాలు రాశాడు. ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని, ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రాశాడు. తొలినాళ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా పనిచేసిన వెన్నెలకంటి... శ్రీరామచంద్రుడు సినిమాతో గీత రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. దాదాపు రెండు వేల పాటలు రాశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రఖ్యాత సినీ గీత రచయితకన్నుమూత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ (64)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 06 Jan 2021 05:47PM

Photo Stories