Skip to main content

పరిశోధన రంగంలో ఈయూతో ఒప్పందం చేసుకున్న దక్షిణాసియా దేశం?

సామాజిక శాస్త్రాల పరిశోధన రంగంలో పరస్పరం సహకరించుకోవడం కోసం ఉద్దేశించిన ఒప్పందంపై అక్టోబర్ 28న భారత్‌, ఐరోపా సమాఖ్య (ఈయూ)లు సంతకాలు చేశాయి.
Current Affairs

ఒప్పంద పత్రాలపై భారత సామాజిక శాస్త్రాల పరిశోధన మండలి సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ వీరేంద్ర కుమార్‌ మల్హోత్రా, ఈయూ రాయబారి యుగోఅస్టుటో సంతకాలు చేశారు. భారత్‌, ఈయూ పరిశోధకుల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుంది.

ఢిల్లీ యూనివర్సిటీ వీసీ సస్పెండ్‌..
ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) యోగేశ్‌ త్యాగిని సస్పెండ్‌ చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో ఆయన వైఫల్యం చెందినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని రాష్ట్రపతి ఆదేశించినట్లు కేంద్ర విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. సాక్ష్యాధారాలు, రికార్డులను తారుమారు చేయకుండా ఉండడం కోసమే యోగేశ్‌ త్యాగిపై రాష్ట్రపతి సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించాయి.

క్విక్ రివ్వూ :

ఏమిటి : ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : భారత్‌
ఎందుకు :సామాజిక శాస్త్రాల పరిశోధన రంగంలో పరస్పరం సహకరించుకోవడం కోసం
Published date : 29 Oct 2020 05:29PM

Photo Stories