Skip to main content

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ జూలై 31న ఆమోదించడంతో అవి చట్టాలుగా మారాయి.
Current Affairs ఆ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహర్‌రెడ్డి జూలై 31న వేర్వేరుగా గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు సాకారం కానుంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం ఆ రెండు బిల్లులకు రూపకల్పన చేసింది.

ఆమోదం పొందక పోయినా...
  • ఆర్టికల్‌ 197(1)(బి) ప్రకారం దిగువ సభ ఆమోదించిన ఒక బిల్లు ఎగువ సభకు వెళ్లి ఆమోదం పొందక పోయినా, నిలిచి పోయినా మూడు నెలల నిర్ణీత వ్యవధి దాటితే మళ్లీ శాసనసభ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకారం రెండోసారి జూన్ 16న సమావేశమైన శాసనసభ మరోసారి ఈ బిల్లులను ఆమోదించి పంపింది.
  • ఆర్టికల్‌ 197(2)(బి) ప్రకారం ఇలా రెండోసారి కూడా ఎగువ సభ ఆమోదం పొందకుండా ఒక బిల్లు నిలిచి పోతే, 30 రోజుల వ్యవధి కనుక దాటితే ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల విషయంలో కూడా అదే జరిగింది.
  • నిబంధనల మేరకు శాసన వ్యవస్థ ఈ బిల్లులను ఆమోదించడంతో జూలై 18న గవర్నర్‌ వద్దకు పంపారు. గవర్నర్‌ ఆ బిల్లులను ఆమోదించడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

చదవండి:
పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు-సమగ్ర సమాచారం

ఏపీ సమగ్రాభివృద్ధిపై బీసీజీ సిఫార్సులు-వివరాలు

ఏపీ రాజధాని అంశంపై హైపవర్ కమిటీ ఏర్పాటు

హైపవర్ కమిటీ కన్వీనర్‌-సభ్యులు
Published date : 02 Aug 2020 10:52AM

Photo Stories