Skip to main content

ప్రధాని మోదీతో కేసీఆర్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు.
న్యూఢిల్లీలో అక్టోబర్ 4న జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు సహా జోనల్ వ్యవస్థలో మార్పు వంటి పలు కీలక అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో బీడు భూములకు సాగునీరు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి చేపట్టనున్న కృష్ణా- గోదావరి నదుల అనుసంధానానికి ఉదారంగా సాయం అందించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు.

కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన హర్ ఘర్ జల్ పథకానికి అనుసంధానించాలని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలని విన్నవించారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలని, ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 05 Oct 2019 05:46PM

Photo Stories