ప్రధాని మోదీ విదేశీ ప్రయాణ ఖర్చు రూ. 255 కోట్లు
Sakshi Education
2016-19 సంవత్సరాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ప్రయాణాలకు ప్రత్యేక విమానాల కోసం రూ.255 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది.
నవంబర్ 21న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వీటితోపాటు 2016-18 సంవత్సరాల మధ్య ప్రధాని విదేశీ నేతలతో హాట్‌లైన్ సంభాషణలకైన ఖర్చు సుమారు రూ.3 కోట్లని తెలిపారు. ప్రభుత్వ విధానం ప్రకారం.. దేశం లోపల వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లలో ప్రధాని అధికారికంగా పర్యటిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవని, అవన్నీ ఉచితమన్నారు.
Published date : 22 Nov 2019 06:08PM