ప్రధాని మోదీ ప్రకటించిన గతిశక్తి భారత్ ప్రాజెక్టు ఉద్దేశం?
Sakshi Education
75వ స్వాతంత్య్రదిన అమృతోత్సవవేడుకలసందర్భంగా 2021, ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు.
రూ.100లక్షల కోట్లతో గతిశక్తి భారత్
ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 100 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రాజెక్టును ప్రకటించారు. ‘‘అత్యంత ఆధునిక సదుపాయాల కల్పనలో సంపూర్ణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం త్వరలోనే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళికను ప్రారంభించబోతున్నాం. రూ.100 లక్షల కోట్లతో ప్రారంభించే ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి’’ అని ప్రధాని వివరించారు.
సైనిక స్కూళ్లలో అమ్మాయిలకూ ప్రవేశం
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లలో అబ్బాయిలకే ప్రవేశం ఉండేది. అయితే అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు కూడా అన్ని సైనిక స్కూళ్లలో ప్రవేశానికి అనుమతిలిస్తున్నాం.. అని ప్రధాని మోదీ చెప్పారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లు ఉండగా, రెండున్నరేళ్ల క్రితం మిజోరంలోని సైనిక స్కూలులో ప్రయోగాత్మకంగా అమ్మాయిలకి ప్రవేశం కల్పించారు.
జాతీయ హైడ్రోజన్ మిషన్
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతుల హబ్‌గా భారత్‌కు మార్చడానికి ప్రధానమంత్రి జాతీయ హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించారు. స్వతంత్ర భారతావని శతాబ్ది ఉత్సవాల సమయానికి ఇంధన రంగంలో స్వయంసమృద్ధిని సాధిస్తామని చెప్పారు.
అనంతరం ప్రసంగిస్తూ... దేశ స్వాతంత్య్రదిన శతాబ్ది వేడుకల సమయానికి భారత్‌ను ఒక ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజలు చేసే కృషి అత్యంత కీలకమైనదనిపిలుపునిచ్చారు. వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రస్తవిస్తూ... ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు మార్గదర్శకాలను సూచిస్తూ, కొత్త అభివృద్ధి పథకాలను ప్రకటించారు. ఎర్రకోట వేదికగా వరసగా ఎనిమిదోసారి ప్రసంగించినమోదీ.. సబ్‌కాసాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కావిశ్వాస్ అన్న నినాదానికి కొత్తగా సబ్‌కాప్రయాస్ (సమష్టి కృషి) అన్న దానిని చేర్చారు.భారత్ నిర్దేశించుకున్న 100శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రజలందరి కృషి అత్యంత అవసరమని గట్టిగా చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన కోసం రూ.100 లక్షల కోట్లతో గతి శక్తి అనే భారీ పథకాన్ని ప్రకటించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- దేశం నలుమూలలకి రైలు కనెక్టివిటీ పెరిగేలా ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో 75 కొత్త వందేభారత్ రైళ్లు ప్రవేశ పెడతాం. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ కలిపేలా రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తాం.
- వ్యవసాయం రంగంలో 80శాతానికిపైగా ఉన్న చిన్న రైతులే దేశానికి గర్వకారణం. వారికి అండగా ఉండడానికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 10 కోట్ల మంది రైతులకు ఇప్పటివరకు రూ.1.5 లక్షల కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.
- 2024 నాటికి గ్రామీణ ప్రజలందరి ఇళ్లకి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నఉద్దేశంతో ప్రారంభించి జాతీయ జల జీవన్ మిషన్‌లో భాగంగా గత రెండేళ్లలో 4.5 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చాం.
- దేశ విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని ఆగస్టు 14న విభజన గాయాల స్మృతి దినంగా పాటిద్దామని పిలుపునిచ్చారు.
- జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి.
- కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలన కోసమేనని, విద్యాబోధన వారి మాతృభాషలో చేయడానికే ప్రోత్సాహం.
రూ.100లక్షల కోట్లతో గతిశక్తి భారత్
ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 100 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రాజెక్టును ప్రకటించారు. ‘‘అత్యంత ఆధునిక సదుపాయాల కల్పనలో సంపూర్ణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం త్వరలోనే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళికను ప్రారంభించబోతున్నాం. రూ.100 లక్షల కోట్లతో ప్రారంభించే ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి’’ అని ప్రధాని వివరించారు.
సైనిక స్కూళ్లలో అమ్మాయిలకూ ప్రవేశం
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లలో అబ్బాయిలకే ప్రవేశం ఉండేది. అయితే అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు కూడా అన్ని సైనిక స్కూళ్లలో ప్రవేశానికి అనుమతిలిస్తున్నాం.. అని ప్రధాని మోదీ చెప్పారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లు ఉండగా, రెండున్నరేళ్ల క్రితం మిజోరంలోని సైనిక స్కూలులో ప్రయోగాత్మకంగా అమ్మాయిలకి ప్రవేశం కల్పించారు.
జాతీయ హైడ్రోజన్ మిషన్
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతుల హబ్‌గా భారత్‌కు మార్చడానికి ప్రధానమంత్రి జాతీయ హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించారు. స్వతంత్ర భారతావని శతాబ్ది ఉత్సవాల సమయానికి ఇంధన రంగంలో స్వయంసమృద్ధిని సాధిస్తామని చెప్పారు.
Published date : 17 Aug 2021 04:22PM