ప్రధాని మోదీ ఇటీవల ఏ నగర మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు?
Sakshi Education
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులకు డిసెంబర్ 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.
రూ.8,379.62 కోట్లతో చేపడుతున్న ఈ మెట్రోరైలు ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. తాజ్ మహల్, ఆగ్రా ఫోర్టు వంటి పలు పర్యాటక కేంద్రాలను... రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌లతో కలుపుతూ రెండు కారిడార్లతో ఈ మెట్రోరైలు మార్గాన్ని నిర్మించనున్నారు.
సైనిక దళాల ఫ్లాగ్ డే...
మన సైనికుల నిస్వార్థమైన సేవ, సాహసాలు, త్యాగం పట్ల దేశం గర్విస్తోందని... సైనిక దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 1949 నుంచి ఏటా డిసెంబర్ 7వ తేదీని ఫ్లాగ్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆగ్రా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : ఆగ్రా ప్రజలకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు

Published date : 08 Dec 2020 05:24PM