ప్రభుత్వరంగ సంస్థల విభాగాన్ని ఏ శాఖలో విలీనం చేశారు?
ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్/డీపీఈ)ను కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఉప విభాగంగా ‘డీపీఈ (లోక్ ఉద్యమ్ విభాగ్)’ను చేర్చినట్టు జూలై 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖకు పూర్తి నియంత్రణకు మార్గం ఏర్పడింది. ఈ నిర్ణయంతో ఆర్థిక శాఖ కింద ప్రస్తుతం ఆరు విభాగాలు ఉన్నట్టు అవుతుంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కింద ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయాలు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్/డీపీఈ)ను కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం
ఎప్పుడు : జూలై 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి.. త్వరితంగా ప్రైవేటీకరణ చేసేందుకు వీలుగా...