ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేదు: ఎస్‌బీఐ
Sakshi Education
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రభుత్వం నుంచి తమకు మూలధన నిధుల సాయం అవసరం లేదని, తగినన్ని నిధుల లభ్యత ఉందని ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ ఆగస్టు 27న వెల్లడించింది.
వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు, రుణ వితరణ సామర్థ్యం ఇనుమడింపజేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు తక్షణమే రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 23న ప్రకటించిన విషయం తెలిసిందే.
Published date : 28 Aug 2019 05:41PM