Skip to main content

ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రధాని కార్యాలయం సహా వివిధ కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రుల చిత్రాలను తొలగించారు.
2019, ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతాయని ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసీ ప్రకటన నుంచే ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుంది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రులు, అధికారిక వర్గాలు పథకాలు, వాటికి నిధుల కేటాయింపులు జరపకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అధికార పార్టీ కానీ, మంత్రులు కానీ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాగే ప్రచారానికి అధికారులను ఉపయోగించుకోకూడదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు
ఎప్పుడు : మార్చి 12
ఎందుకు : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా
Published date : 13 Mar 2019 03:50PM

Photo Stories