Skip to main content

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత శాతం ఆహార ధాన్యాలను జనపనార సంచుల్లోనే నిల్వ చేయాలి?

ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
Current Affairs

100 శాతం ఆహార ధాన్యాలను, 20 శాతం పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన అక్టోబర్ 29న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. జౌళి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుంది.

జ్యూట్‌ ఐకేర్‌..
జౌళి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జ్యూట్‌ ఐకేర్‌’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ కోసం నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

క్విక్ రివ్వూ :

ఏమిటి : 100 శాతం ఆహార ధాన్యాలను, 20 శాతం పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిల్వ చేయాలి
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు :జౌళి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు
Published date : 30 Oct 2020 05:42PM

Photo Stories