ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Sakshi Education
ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ ఏప్రిల్ 23న మరో ఘనత సాధించింది.
కేవలం ఏడాదిలోనే మూడు సార్లు వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌకను నింగిలోకి పంపింది. ఏప్రిల్ 23న అమెరికాలోని కేప్ కనావెరాల్ నుంచి గతంలో నింగిలోకి పంపిన రాకెట్, కాప్య్సూల్‌ను తిరిగి ఉపయోగించగలిగేదిగా (రీయూజబుల్) మార్చి దాని ద్వారా నలుగురు వ్యోమగాములను కక్ష్యకు వద్దకు పంపింది. వీరిలో అమెరికా, జపాన్, ఫ్రాన్స్‌లకు చెందిన వ్యోమగాములున్నారు. ఈ అంతరిక్ష నౌకలో వీరు 23 గంటల పాటు ప్రయాణం చేసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఏప్రిల్ 24న చేరుకోనున్నారు. అనంతరం దాదాపు ఆరు నెలలు అక్కడే గడపనున్నారు.
స్పేస్‌ఎక్స్...
స్థాపన: 2002, మే 6
స్థాపకులు: ఎలాన్ మస్క్
ప్రధాన కార్యలయం: హౌథ్రోన్, కాలిఫోర్నియా, అమెరికా
స్పేస్‌ఎక్స్...
స్థాపన: 2002, మే 6
స్థాపకులు: ఎలాన్ మస్క్
ప్రధాన కార్యలయం: హౌథ్రోన్, కాలిఫోర్నియా, అమెరికా
Published date : 24 Apr 2021 06:26PM