పోటీతత్వ సూచీలో భారత్‌కు 68వ స్థానం
Sakshi Education
అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అక్టోబర్ 8న విడుదల చేసిన 58వ అంతర్జాతీయ పోటీతత్వ సూచీ(గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్)లో భారత్ 10 స్థానాలు దిగజారి 68వ స్థానంలో నిలిచింది.
మొత్తం 141 దేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీని రూపొందించారు.
పోటీతత్వ సూచీ-ముఖ్యాంశాలు
వివిధ అంశాల్లో భారత్ స్థానం
కాంపిటీటివ్ ఇండెక్స్ 2019
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌కు 68వ స్థానం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)
ఎక్కడ : ప్రపంచంలో
పోటీతత్వ సూచీ-ముఖ్యాంశాలు
- అంతర్జాతీయంగా అత్యంత పోటీపడగల ఆర్థిక వ్యవస్థగా సింగపూర్ అవతరించింది. ఈ విషయంలో అమెరికా స్థానాన్ని కొల్లగొట్టింది.
- పోటీతత్వ సూచీలో 2018 ఏడాది భారత్ 58వ స్థానంలో ఉంది.
- ప్రధానంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉండడం భారత్ వెనక్కి వెళ్లిపోవడానికి కారణం.
- బ్రిక్స్‌లోని ఐదు దేశాల్లో భారత్, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థల ర్యాంకులే తక్కువగా ఉన్నాయి. ఈ సూచీలో బ్రెజిల్ 71వ స్థానంలో ఉంది.
- కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ తమ స్థానాలు మెరుగుపరుచుకుని భారత్‌ను అధిగమించాయి.
- స్థూల ఆర్థిక అంశాల పరంగా స్థిరత్వం, మార్కెట్ సైజు పరంగా భారత్ ర్యాంకు ఉన్నత స్థానంలోనే ఉంది. వాటాదారుల గవర్నెన్స్ విషయంలో భారత్ అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలిచింది.
వివిధ అంశాల్లో భారత్ స్థానం
అంశం | స్థానం |
పురుష, మహిళా కార్మికుల నిష్పత్తి | 128 |
ఆవిష్కరణలు | 35 |
నైపుణ్యాలు | 107 |
ఆరోగ్యకర ఆయుర్దాయం | 109 |
కార్పొరేట్ గవర్నెన్స్ | 15 |
మార్కెట్‌సైజు | 3 |
కాంపిటీటివ్ ఇండెక్స్ 2019
దేశం | స్థానం |
సింగపూర్ | 1 |
అమెరికా | 2 |
హాంగ్‌కాంగ్ | 3 |
నెదర్లాండ్‌స | 4 |
స్విట్జర్లాండ్ | 5 |
చైనా | 28 |
వియత్నాం | 67 |
శ్రీలంక | 84 |
బంగ్లాదేశ్ | 105 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌కు 68వ స్థానం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 10 Oct 2019 05:56PM