Skip to main content

పోస్టల్‌ శాఖ ఈ–షాప్‌ వెబ్‌పోర్టల్‌ ఆవిష్కరణ

జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) ట్యాగ్‌ కలిగిన తెలంగాణ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి తపాలా శాఖ తెలంగాణ సర్కిల్‌ రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆగస్టు 7న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు.
తెలంగాణలోని హస్తకళల ఉత్పత్తులు, జీఐ ట్యాగ్‌ ఉత్పత్తుల విక్రయాల కోసం పోస్టల్‌ శాఖ ఈ కామర్స్‌ వెబ్‌పోర్టల్‌ ‘ఈ–షాప్‌’(www.eshop.tsposts.in) ను సైతం గవర్నర్‌ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు.

భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరహక్కుల పరిరక్షణ కోసం వాటికి జీఐ ట్యాగ్‌ హోదాను కల్పిస్తున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన 13 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌ హోదా లభించగా, ఇప్పటికే తపాలా శాఖ 5 ఉత్పత్తులపై ప్రత్యేక పోస్టర్‌ కవర్లను తీసుకొచ్చింది. నిర్మల్‌ కొయ్యబొమ్మలు, వరంగల్‌ రగ్గులు, నారాయణపేట చేనేత చీరలు, హైదరాబాద్‌ హలీమ్, సిద్దిపేట గొల్లభామ చీరలపై రూపొందించిన పోస్టల్‌ కవర్లను గవర్నర్‌ తాజాగా ఆవిష్కరించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : పోస్టల్‌ శాఖ ఈ కామర్స్‌ వెబ్‌పోర్టల్‌ ‘ఈ–షాప్‌’(ఠీఠీఠీ.్ఛటజిౌp.్టటఞౌట్టట. జీn) ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
ఎక్కడ : రాజ్‌భవన్, హైదరాబాద్‌
ఎందుకు : తెలంగాణలోని హస్తకళల ఉత్పత్తులు, జీఐ ట్యాగ్‌ ఉత్పత్తుల విక్రయాల కోసం...
Published date : 09 Aug 2021 05:49PM

Photo Stories