Skip to main content

పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆనంద్‌కు టైటిల్

ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) సీవీ ఆనంద్‌కు టైటిల్ లభించింది.
Current Affairsవిశాఖపట్నంలో డిసెంబర్ 22న ముగిసిన ఈ టోర్ని పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో సీఐఎస్‌ఎఫ్ తరఫున బరిలోకి దిగిన ఆనంద్ 8-4తో సత్యనారాయణ (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించారు. గత 20 ఏళ్లలో ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కు ఓ విభాగంలో టైటిల్ లభించడం ఇదే ప్రథమం.

ఈ టోర్ని టీమ్ చాంపియన్‌షిప్ విభాగంలో సీఆర్‌పీఎఫ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఐటీబీపీపై సీఆర్‌పీఎఫ్ గెలిచింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 19 జట్ల నుంచి 103 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్ టైటిల్ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : సీవీ ఆనంద్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 23 Dec 2019 05:34PM

Photo Stories