Skip to main content

పంజాబ్– సింద్ బ్యాంక్‌లో భారత ప్రభుత్వ వాటా?

పీఎస్యూ సంస్థ పంజాబ్ అండ్ సింద్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 5,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు సమకూర్చింది.
Current Affairsఇందుకు వీలుగా బ్యాంకు ప్రభుత్వానికి 335 కోట్లకుపైగా ప్రిఫరెన్స్‌ షేర్లను కేటాయించింది. తాజా కేటాయింపుల తదుపరి బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 83.06 శాతం నుంచి 97.07 శాతానికి ఎగసింది. పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

సీఐఐ మహిళా విభాగం చైర్‌పర్సన్‌గా షాలిని...
సీఐఐ మహిళా విభాగం దక్షిణాది చైర్‌పర్సన్‌గా (ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌) ఫెడరల్‌ బ్యాంకు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, ఈడీ షాలిని వారియర్‌ 2021–22 సంవత్సరానికి నియమితులయ్యారు. ఫెడరల్‌ బ్యాంకు రిటైల్‌ విభాగం హెడ్‌గానూ షాలిని వారియర్‌ పనిచేస్తున్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సభ్యురాలుగానూ పనిచేస్తున్నారు.
Published date : 29 Mar 2021 01:00PM

Photo Stories