Skip to main content

పళని పంచామృతానికి జీఐ గుర్తింపు

తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ గుర్తింపు లభించింది.
ఈ విషయాన్ని జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్ ఆగస్టు 14న వెల్లడించారు. తమిళనాడులోని దిండుగల్ జిల్లా పళనిలో ఉన్న దండాయుధపాణి స్వామి(సుబ్రహ్మణ్యస్వామి) ఆలయంలో పళని పంచామృతాన్ని తయారుచేస్తారు. సహజ సిద్ధంగా ఐదు రకాల వస్తువులతో ఈ ప్రసాదం తయారు చేస్తారు. అరటి, బెల్లం, ఆవు నెయి్య, స్వచ్ఛమైన తేనె, కర్జూరం వంటి వాటితో సిద్ధం చేస్తున్న ఈ పంచామృతం కొనుగోలుకు భక్తులు బారులు తీరుతుంటారు. పళని అంటే పంచామృతంఅని అర్థం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పళని పంచామృతానికి జీఐ గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్
ఎక్కడ : దండాయుధపాణి స్వామి ఆలయం, పళని, దిండుగల్, తమిళనాడు
Published date : 15 Aug 2019 05:25PM

Photo Stories