Skip to main content

పీటీఐ చైర్మన్‌గా అవీక్ సర్కార్ ఎన్నిక

ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) చైర్మన్‌గా ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎమిరిటస్, వైస్ చైర్మన్ అవీక్ సర్కార్(75) ఎన్నికయ్యారు.
Current Affairs
ఈ విషయాన్ని పీటీఐ బోర్డు ఆగస్టు 29న ధ్రువీకరించింది. పంజాబ్ కేసరి గ్రూప్ చీఫ్ ఎడిటర్ విజయ్‌కుమార్ చోప్రా స్థానంలో అవీక్ సర్కార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సర్కార్.. టెలిగ్రాఫ్, ఆనంద్ బజార్ పత్రిక డైలీలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ గ్రూప్ కింద ఆరు టీవీ చానళ్లు, అనేక మేగజీన్లు ఉన్నాయి. పెంగ్విన్ ఇండియాకు ఫౌండింగ్ ఎండీగా, బిజినెస్‌స్టాండర్డ్‌కు ఫౌండింగ్ ఎడిటర్‌గానూ వ్యవహరించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎమిరిటస్, వైస్ చైర్మన్ అవీక్ సర్కార్
Published date : 01 Sep 2020 04:39PM

Photo Stories