Skip to main content

పీహెచ్‌డీ వర్క్ వీసాలపై పరిమితి ఎత్తివేత

లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతిభావంతులను ఆకర్షించే దిశగా బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది.
పీహెచ్‌డీ స్థాయి వర్క్ వీసాలపై ఇప్పటివరకూ ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటించింది. తాజా నిర్ణయంతో బ్రిటన్‌లో పనిచేయడంతో పాటు స్థిరపడాలనుకునే భారతీయ నిపుణులకు గణనీయమైన లబ్ధిచేకూరనుంది. ఈ విషయమై బ్రిటన్ ఛాన్స్‌లర్ ఫిలిప్ హమ్మండ్ మాట్లాడారు. పీహెచ్‌డీ వర్క్ వీసాలను టైర్-2(సాధారణ) కేటగిరి నుంచి మినహాయిస్తాం. అలాగే పరిశోధకులు ఏడాదికాలంలో 180 రోజులకు మించి బ్రిటన్‌ను విడిచిపెట్టరాదన్న ఇమిగ్రేషన్ నిబంధనలను కూడా సవరిస్తాం’ అని అన్నారు. బ్రిటన్ జారీచేసే టైర్-2 వీసాను పొందేవారిలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. గతేడాది జారీచేసిన మొత్తం టైర్-2 వీసాల్లో 54 శాతం వీసాలను భారతీయులే దక్కించుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్‌లో పీహెచ్‌డీ వర్క్ వీసాలపై పరిమితి ఎత్తివేత
ఎప్పుడు : మార్చి 14
ఎక్కడ : బిట్రన్
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతిభావంతులను బ్రిటన్ ఆకర్షించేందుకు...
Published date : 15 Mar 2019 06:16PM

Photo Stories