Skip to main content

పీఎంఎఫ్‌బీవైలో మార్పులకు కేబినెట్ ఆమోదం

ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)’లో మార్పులు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Current Affairs ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 19న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో పీఎంఎఫ్‌బీవైలో చేరడం రైతులకు తప్పనిసరి కాదు... రైతులు ఇకపై అందులో చేరడం స్వచ్ఛందమే. పంట రుణాలు తీసుకున్న రైతులు పీఎంఎఫ్‌బీవైలో కచ్చితంగా చేరాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండేది.

నిరోధించలేని ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, పండ్ల తోటలు, వ్యాపార పంటలకు 5 శాతం ప్రీమియంతో సమగ్రంగా బీమా సౌకర్యం కల్పించేలా పీఎంఎఫ్‌బీవైని రూపొందించారు.

కేబినెట్ స‌మావేశంలోని మరికొన్ని నిర్ణయాలు...
  • పీఎంఎఫ్‌బీవైతో పాటు రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్‌ పథకంలోనూ కేబినెట్ మార్పులు చేసింది.
  • పాడి రైతులకు ప్రయోజనం కలిగేలా రూ. 4,558 కోట్లతో రూపొందించిన పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. పాడి రైతుల రుణాలకు కల్పించే వడ్డీ రాయితీని 2 శాతం నుంచి 2.5శాతానికి పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపిందన్నారు.
  • రూ. 4,496 కోట్ల బడ్జెట్‌తో 2024 నాటికి కొత్తగా 10 వేల ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్‌లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, 2024 నుంచి 2028 వరకు వీటి నిర్వహణ కోసం రూ. 2,369 కోట్లకు కేటాయించింది. రైతుల ఆదాయ పెంపు, దిగుబడి ఖర్చు తగ్గింపు లక్ష్యంగా ఇవి పనిచేయనున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎంఎఫ్‌బీవైలో మార్పులకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : పంట రుణాలు తీసుకున్న రైతులు పీఎంఎఫ్‌బీవైలో కచ్చితంగా చేరాలన్న నిబంధన సడలించేందుకు
Published date : 20 Feb 2020 07:15PM

Photo Stories