పీఎం కిసాన్ పెన్షన్ కోసం నెలకు రూ.100
Sakshi Education
ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజనలో భాగంగా రైతులు ఇకపై ప్రతినెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జూన్ 13న దిశానిర్దేశం చేశారు. పీఎం కిసాన్ పెన్షన్‌లో చేరిన రైతులు 60 ఏళ్ల వరకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం అంతేమొత్తం చెల్లిస్తుంది. రైతుకు 60 ఏళ్లు నిండాక నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్‌గా కేంద్రం చెల్లించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎం కిసాన్ పెన్షన్ కోసం నెలకు రూ.100
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎం కిసాన్ పెన్షన్ కోసం నెలకు రూ.100
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
Published date : 14 Jun 2019 05:35PM