పీఆర్ మాజీ డెరైక్టర్ నర్సింహారెడ్డి కన్నుమూత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సమాచార, పౌర సంబంధాల శాఖ మాజీ డెరైక్టర్ డా. పీవీ నర్సింహారెడ్డి (87) మార్చి 25న కన్నుమూశారు.
కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన రాత్రి 8.45 గంటల సమయంలో స్వగృహంలో మృతి చెందారు. యూజీసీ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ ప్రొఫెసర్‌గా, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షునిగా, సమాచార, పౌర సంబంధాలకు సంబంధించిన ఏకై క భారతీయ జర్నల్ ఎడిటర్‌గా ఆయన సేవలు అందించారు.
Published date : 27 Mar 2020 11:41AM