పెట్రోటెక్ 2019 సదస్సులో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Sakshi Education
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ఫిబ్రవరి 10న జరిగిన పెట్రోటెక్ 2019 సదస్సులో కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఓపెన్ ఎక్రేజ్ లెసైన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద మూడో విడతలో 23 చమురు, గ్యాస్, సీబీఎం బ్లాక్‌ల వేలం వేయనున్నట్లు చెప్పారు. దీంతో ఈ రంగంలోకి 600-700 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రావొచ్చని అన్నారు. దేశీయంగా ఇంధన ఉత్పత్తి పెంచేందుకు, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెట్రోటెక్ 2019 సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎక్కడ : గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెట్రోటెక్ 2019 సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎక్కడ : గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్
Published date : 11 Feb 2019 05:16PM