పెట్రోనెట్ సీఈఓగా నియమితులైన ఐఓసీఎల్ పైప్‌లైన్స్ డెరైక్టర్?
Sakshi Education
దేశంలో అతిపెద్ద గ్యాస్ దిగుమతిదారు పెట్రోనెట్ ఎన్‌ఎన్‌జీ లిమిటెడ్ (పీఎల్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పైప్‌లైన్స్ డెరైక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు.
ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ప్రభాత్ సింగ్ ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఏకే సింగ్ ఎంపికయ్యారు.
అక్షయ్ బిహార్‌లోని ముజఫర్పూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, దక్షిణ గుజరాత్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐఓసీఎల్ కంటే ముందు ఆయన జీఏఐఎల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆయనకు ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రీలో 34 ఏళ్ల అనుభవం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెట్రోనెట్ ఎన్‌ఎన్‌జీ లిమిటెడ్ (పీఎల్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : ఐఓసీఎల్ పైప్‌లైన్స్ డెరైక్టర్ అక్షయ్ కుమార్ సింగ్

Published date : 09 Nov 2020 05:58PM