పద్మ విభూషణ్ అవార్డీ, సంగీతకారుడు కన్నుమూత
Sakshi Education
ప్రఖ్యాత భారతీయ సంప్రదాయ సంగీతకారుడు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్(89) జనవరి 17న ముంబైలోని తన స్వగృహంలో కన్నుమూశారు.
ఉత్తరప్రదేశ్‌లోని బదాయులో ఉస్తాద్ వారిస్ హుస్సేన్ ఖాన్, సబ్రీ బేగం దంపతులకు 1931, మార్చి 3న ముస్తఫా ఖాన్ జన్మించారు. ప్రఖ్యాత సంగీతకారుడు మురాద్ బక్షీకి మనవడు అయిన ఆయన 1991లో పద్మశ్రీ, 2006లో పద్మభూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2003లో కళా రంగంలో అత్యుత్తమ పురస్కారమైన సంగీత నాటక అకాడెమీ అవార్డుతో ఆయనను సత్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పద్మ విభూషణ్ అవార్డీ, సంగీతకారుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్(89)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : వయో భారం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : పద్మ విభూషణ్ అవార్డీ, సంగీతకారుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్(89)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : వయో భారం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో
Published date : 20 Jan 2021 01:39PM