Skip to main content

పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం

పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటు బైడు, క్యామ్‌కార్డ్, విచాట్‌ రీడింగ్, టెన్సెంట్‌ వీన్, సైబర్‌ హంటర్, లైఫ్‌ ఆఫ్టర్‌ వంటి పలు యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌ 2న వెల్లడించింది.
Edu news

ఈ యాప్‌ల వల్ల దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందు వల్లే తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్, యాపిల్‌ ప్లేసోర్ట నుంచి ఈ 118 యాప్‌లను తొలగించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్‌ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. పబ్‌జీ గేమ్‌ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్‌లో పబ్‌జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు.

మరో 47 చైనా యాప్‌లపై నిషేధం

118 నిషేధిత యాప్‌ల జాబితా...

Edu news
Edu news
Edu news
క్విక్‌ రివ్యూ :
ఏమిటి
: పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం
ఎప్పుడు : సెప్టెంబర్‌ 2
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : భారత్‌
ఎందుకు : దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున
Published date : 02 Sep 2020 06:34PM

Photo Stories