పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
Sakshi Education
భూతాపాన్ని కట్టడి చేయడానికి కుదిరిన పారిస్ వాతావరణ ఒప్పందం-2015 నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా లాంఛనంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి తెలియజేసింది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఒక నోటీసు అందజేశారు. నోటీసు ఇచ్చిన ఏడాది తర్వాత అది అమలవుతుంది. అంటే.. 2020 ఏడాది నవంబర్ 4న అమెరికా ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలుగుతుంది.
చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందంపై భారత్ సహా 188 దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇందులో కీలక పాత్ర పోషించారు. ఒబామా తర్వాత అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా పరిశ్రమల పోటీతత్వాన్ని దెబ్బతీయడానికి భారత్, చైనా వంటి దేశాలకు సాధికారత కల్పించడానికే దీన్ని తెచ్చారని ఆరోపించారు. ఒప్పందం నుంచి వైదొలుగుతామని 2017, జూన్ 1న ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పారిస్ వాతావరణ ఒప్పందం-2015 నుంచి వైదొలుగుతాం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : అమెరికా

Published date : 06 Nov 2019 06:03PM