పాకిస్తాన్‌కు ఎఫ్‌ఏటీఎఫ్ చివరి హెచ్చరిక
Sakshi Education
ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు, ద్రవ్య అక్రమ రవాణా అరికట్టే విషయంలో ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ఖాయమని ఎఫ్‌ఏటీఎఫ్ పాకిస్తాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది.
2020 ఫిబ్రవరి నాటికి 27 అంశాలతో కూడిన ఎఫ్‌ఏటీఎఫ్ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ఆర్థిక ఆంక్షలు తప్పవని ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షుడు జియాంగ్మిన్ లియూ అక్టోబర్ 18న హెచ్చరించారు.
పూర్తిగా విఫలమైంది...
పాక్‌ని ప్రస్తుతం ‘గ్రే లిస్ట్’లో కొనసాగించినా, లేక ‘డార్క్ గ్రే లిస్ట్’లో ఉంచినా ఆర్థిక ఆంక్షల చట్రం బిగుసుకుంటుంది. ఐఎంఎఫ్ నుంచి గానీ, యూరోపియన్ యూనియన్ నుంచి గానీ పాక్‌కు ఏవిధమైన ఆర్థిక సాయం ఉండదు. ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు నిలిపివేయాలంటూ 2018లో పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’ లో పెట్టింది.
అంతర్జాతీయ ఆర్థిక సమర్థత కోసం ఏర్పాటు చేసిన ఎఫ్‌ఏటీఎఫ్ 1989 నుంచి ప్రభుత్వ అంతర్ సంస్థగా మారింది. ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఐఎంఎఫ్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థలు పాల్గొన్నాయి.

Published date : 19 Oct 2019 05:23PM