పాకిస్తాన్ ప్రధాని విమానానికి భారత్ అనుమతి
Sakshi Education
భారత గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అధికారిక పర్యటన కోసం ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక విమానంలో శ్రీలంకకు వెళ్లనున్నారు. వీవీఐపీ విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లడానికి అన్ని దేశాలు అంగీకరించడం పరిపాటి. అయితే, పాకిస్తాన్ సర్కారు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. 2019లో భారత విమానాలు తమ గగనతలం గుండా వెళ్లకుండా నిషేధం విధించింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే విమానానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ విమానం మరోమార్గంలో వెళ్లాల్సి వచ్చింది.
Published date : 24 Feb 2021 06:18PM