Skip to main content

పాకిస్తాన్ ఇచ్చిన ఎంఎఫ్‌ఎన్ హోదా రద్దు

పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత అనుకూల దేశం(మోస్ట్ ఫేవర్డ్ నేషన్-ఎంఎఫ్‌ఎన్)’ హోదాను భారత్ రద్దుచేసింది.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఫిబ్రవరి 15న భేటీ అయిన కేబినెట్ భద్రతా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకి స్తాన్ నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాలు పెంచే అవాకాశం ఉంది. సుమారు 49కోట్ల డాలర్ల పాకిస్తాన్ ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. పాకిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ప్రధానంగా ముడిపత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్, రంగులు తదితరాలున్నాయి.

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సభ్యదేశాలు తమలో తాము వివక్షాపూరిత వాణిజ్య విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ఎంఎఫ్‌ఎన్ హోదాను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ హోదా కలిగిన దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉంటాయి. పాకిస్తాన్‌కు అత్యంత అనుకూల దేశం హోదాను భారత్ 1996లో ఇవ్వగా, ఇంకా భారత్‌కు పాకిస్తాన్ ఆ హోదా ఇవ్వలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పాకిస్తాన్ ఇచ్చిన ఎంఎఫ్‌ఎన్ హోదా రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత్
ఎందుకు : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో
Published date : 16 Feb 2019 03:20PM

Photo Stories