పాకిస్తాన్ అణు క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్-1’ను పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది.
నవంబర్ 18న పరీక్షించిన ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. 2019, ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ‘ఘజ్నావీ’ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. భారత్ కూడా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణితో పాటు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్-1’ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : పాకిస్తాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్-1’ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : పాకిస్తాన్
Published date : 19 Nov 2019 04:56PM