Skip to main content

పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ?

భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించారు.
Current Affairs
30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13 గంటల 43 నిమిషాల్లోనే ఈదారు. శ్రీలంక తీరం నుంచి మార్చి 19న ఉదయం 4.15 గంటలకు బయల్దేరిన ఆమె సా. 5.58 గంటలకు రామేశ్వరంలోని ధనుష్‌కోటి చేరుకున్నారు. పాక్‌ జలసంధిని ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా కూడా శ్యామల నిలిచారు.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామల 44 ఏళ్ల వయసులో స్విమ్మింగ్‌ నేర్చుకున్నారు. పలు ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ఆమె తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్‌ లిఫ్టర్‌.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : పాక్‌ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ?
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : గోలి శ్యామల
ఎక్కడ : పాక్‌ జలసంధి, భారత్, శ్రీలంకల మధ్య
Published date : 23 Mar 2021 11:35AM

Photo Stories