Skip to main content

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదం

రానున్న ఆర్థిక సంవత్సరం 2021 – 22లో తొలి మూడు నెలల (ఏప్రిల్ – జూన్) కాలానికి వివిధ శాఖలు, రంగాల వారీగా వ్యయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.70,983.11 కోట్లను కేటాయించింది.
Current Affairsస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చిలో ప్రభుత్వం నిర్వహించలేదు. అలాగే కోవిడ్‌ – 19 వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో 2021 – 22 తొలి మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపగా మార్చి 29న ఆయన ఆమోదముద్ర వేశారు.

ఓర్వకల్లులో ఇండస్ట్రియల్‌ పార్క్‌...
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద 10 వేల ఎకరాలతో భారీ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Published date : 30 Mar 2021 03:05PM

Photo Stories