ఓర్వకల్లులో క్షిపణి పరీక్ష
Sakshi Education
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో సెప్టెంబర్ 11న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది.
తక్కువ బరువు కలిగిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గెడైడ్ మిసైల్ (ఎంపీఏటీజీఎం)ను డీఆర్‌డీవో ప్రయోగించగా.. అది నిర్దేశించిన 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అనుకున్న సమయానికి ఛేదించింది. డీఆర్‌డీవో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిలో ఆల్ట్రా మోడరన్ ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ రాడార్ వంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. సైన్యం అవసరాల కోసం తయారు చేసిన ఈ క్షిపణిని ప్రయోగించడం ఇది వరుసగా మూడోసారని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గెడైడ్ మిసైల్ (ఎంపీఏటీజీఎం) పరీక్ష విజయవంతం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : ఓర్వకల్లు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

Published date : 12 Sep 2019 04:04PM