Skip to main content

Operation Devi Shakti: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ దేవీ శక్తి కార్యక్రమం ఉద్దేశం?

పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌ మెమోరియల్‌ సముదాయాన్ని పునరుద్ధరించారు.
సుందరీకరించిన ఈ మెమోరియల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 28న ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఆపరేషన్‌ దేవీ శక్తి గురించి ప్రస్తావించారు. ఆపరేషన్‌ దేవీ శక్తిలో భాగంగా పలువురు స్వదేశీయులను అఫ్గాన్‌ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ తరలింపులో భాగంగా ప్రజలతో పాటు పవిత్రమైన సిక్కు మత గ్రంధాలను కూడా వెనక్కు తెచ్చామని మోదీ తెలిపారు. కోవిడ్‌ కావచ్చు, అఫ్గాన్‌ సంక్షోభం కావచ్చు... భారతీయులకు కష్టం వస్తే భారత్‌ వెంటనే ఆదుకుంటుందనే సందేశమిచ్చారు.

స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1919 సంవత్సరం ఏప్రిల్‌ 13వ తేదీన జలియన్‌వాలాలో సమావేశమైన వేలాది మందిపై బ్రిటిష్‌ సైనికులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో వేయి మంది పౌరులు నేలకొరగ్గా, వందలాదిగా గాయాలపాలైన విషయం తెలిసిందే.
Published date : 30 Aug 2021 06:04PM

Photo Stories