Skip to main content

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌?

సెయిలింగ్‌ క్రీడాంశం మహిళల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ సెయిలర్‌గా తమిళనాడుకు చెందిన నేత్రా కుమనన్‌ ఏప్రిల్‌ 7న రికార్డు రికార్డు సృష్టించింది.
Current Affairs
చెన్నైకి చెందిన 23 ఏళ్ల నేత్ర ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లో లేజర్‌ రేడియల్‌ క్లాస్‌ ఈవెంట్‌లో పోటీపడుతోంది. ఏప్రిల్‌ 7న రేసులు ముగిశాక 21 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్‌ 8న జరిగే చివరి రోజు రేసుల తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేత్రకు ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారైంది. మరో రేసు మిగిలి ఉండగానే నేత్ర కుమనన్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

ఇప్పటివరకు తొమ్మిది మంది...
ఇప్పటివరకు భారత్‌ నుంచి సోలీ కాంట్రాక్టర్, బాసిత్‌ (1972 మ్యూనిక్‌), ధ్రువ్‌ భండారి (1984 లాస్‌ ఏంజెలిస్‌), కెల్లీ రావు (1988 సియోల్‌), ఫారూఖ్‌ తారాపూర్, సైరస్‌ కామా (1992 బార్సిలోనా), మాలవ్‌ ష్రాఫ్, సుమీత్‌ పటేల్‌ (2004 ఏథెన్స్‌), నచ్తార్‌ సింగ్‌ జోహల్‌ (2008 బీజింగ్‌) సెయిలింగ్‌లో ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు. వీరందరూ పురుషులే.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : నేత్రా కుమనన్‌
ఎందుకు : ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లో లేజర్‌ రేడియల్‌ క్లాస్‌ ఈవెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
Published date : 08 Apr 2021 05:42PM

Photo Stories