ఒడిశాలో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు
Sakshi Education
2020, ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు జరగబోయే ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలకు ఒడిశా ఆతిథ్యమివ్వనుంది.
గతేడాది ఒలింపిక్ క్వాలిఫయర్స్‌తో సహా పలు జాతీయస్థాయి హాకీ టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరంలో ఈ క్రీడలు జరుగనున్నట్లు ఆ రాష్ట్ర క్రీడా మంత్రి తుషార్కంటి బెహెరా జనవరి 27న తెలిపారు. 17 విభాగాల్లో జరగబోయే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 100 యూనివర్సిటీల నుంచి 4వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొననున్నారు.
రన్నరప్ సౌరవ్ ఘోషాల్
పిట్స్‌బర్గ్ ఓపెన్ టోర్నీలో భారత స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ రన్నరప్‌గా నిలిచాడు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో జనవరి 26న జరిగిన ఫైనల్లో ఘోషాల్ 7-11, 4-11, 9-11తో టాప్ సీడ్ ఫేర్స్ డస్సోకీ (ఈజిప్ట్) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలకు ఆతిథ్యం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : ఒడిశా ప్రభుత్వం
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా

Published date : 28 Jan 2020 05:44PM