Skip to main content

న్యూయార్క్ అసెంబ్లీలో కశ్మీర్‌పై తీర్మానం

ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్ అమెరికన్ డే’గా ప్రకటించాలని గవర్నర్ అండ్రూ క్యుఒమోను కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ ఫిబ్రవరి 8న ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది.
Edu news

అసెంబ్లీ సభ్యుడు నాదర్ సాయేఘ్, మరో 12 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘కశ్మీరీలు పట్టుదలతో కృషి చేసి న్యూయార్క్ వలస ప్రజలకు పునాదిగా నిలిచారు. కశ్మీరీ ప్రజల మత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలకు న్యూయార్క్ రాష్ట్రం మద్దతునిస్తుంది’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

కశ్మీర్‌పై న్యూయార్క్ అసెంబ్లీ చేసిన తీర్మానంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్ ఘన సంస్కృతిని, సామాజిక సంప్రదాయాలను తప్పుగా చూపి కశ్మీర్ ప్రజలను విడదీసే చర్యగా ఈ తీర్మానాన్ని అభివర్ణించింది. ఈ తీర్మానం వెనుక స్వార్ధ శక్తులున్నాయని ఆరోపించింది.

బెడైన్‌కు మోదీ ఫోన్
అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జో బెడైన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 8న తొలిసారి మాట్లాడారు. ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

Published date : 09 Feb 2021 06:12PM

Photo Stories