Skip to main content

నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేక భేటీ

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2019, నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేకంగా భేటీ అవనుంది.
రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఈ సమావేశానికి హాజరై ప్రసంగించనున్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో పాటు, మాజీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కూడా పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పార్లమెంటు 50 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని 1997లో కూడా ఇటువంటి సభ జరిగింది. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019, నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేక భేటీ
ఎప్పుడు : నవంబర్ 6
ఎక్కడ : పార్లమెంటు సెంట్రల్‌హాల్
ఎందుకు : భారత రాజ్యాంగం ఆమోదం పొంది 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా
Published date : 07 Nov 2019 05:39PM

Photo Stories