Skip to main content

నూతన విద్యా విధానంపై గవర్నర్ల సదస్సు

‘రోల్ ఆఫ్ ఎన్‌ఈపీ ఇన్ ట్రాన్స్ ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్’అనే అంశంపై సెప్టెంబర్ 7న గవర్నర్ల సదస్సు జరిగింది.
Current Affairsప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు, వర్సిటీల వైస్ చాన్సెలర్లు పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభోపన్యాసం చేశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌కు జీడీపీలో అమెరికా 2.8 శాతం, దక్షిణ కొరియా 4.2 శాతం, ఇజ్రాయెల్ 4.3 శాతం నిధులను కేటాయిస్తుండగా, భారత్ మాత్రం జీడీపీలో 0.7 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తోందని కోవింద్ పేర్కొన్నారు.

సదస్సులో ప్రధాని ప్రసంగిస్తూ... నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) కేవలం ప్రభుత్వ విధానం కాదని.. అది మొత్తంగా భారత దేశ విద్యా విధానమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం కూడా దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. దేశ విద్యా విధానం ఆ దేశ ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని అభివర్ణించారు.

చదవండి: నూతన విద్యావిధానం-ముఖ్యాంశాలు
Published date : 09 Sep 2020 12:22PM

Photo Stories