Skip to main content

నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ బాధ్యతలు

కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.
Current Affairs
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె సెప్టెంబర్ 17న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది.

ఎంపీల వేతనాలు తగ్గింపు బిల్లుకు ఆమోదం
పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30 శాతం తగ్గించేందుకు ఉద్దేశించిన ‘శాలరీ, అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్-1954 సవరణ బిల్లు’కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్‌పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బిల్లును లోక్‌సభ సెప్టెంబర్ 15న ఆమోదించగా, సెప్టెంబర్ 18న రాజ్యసభ ఆమోదం తెలిపింది.

చదవండి: ఎంపీల్యాడ్ పథకం నిలిపివేత, ఎంపీల వేతనాల కోత ఆర్డినెన్స్ కు ఆమోదం

క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా అదనపు బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : నరేంద్ర సింగ్ తోమర్
Published date : 19 Sep 2020 04:57PM

Photo Stories