Skip to main content

నోయిడాలో భారీ చరఖా ఆవిష్కరణ

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న సెక్టార్-94 వద్ద ఏర్పాటు చేసిన భారీ చరఖా (రాట్నం)ను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సృ్మతీ ఇరానీ అక్టోబర్ 1న ఆవిష్కరించారు.
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 1,250 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ చరఖాను తయారు చేశారు. మొత్తం 1,650 కేజీల బరువున్న ఈ చరఖా ప్లాస్టిక్ వ్యర్థాలతో భారత్‌లో రూపొందించిన అతిపెద్ద వస్తువుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు పొందింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారీ చరఖా (రాట్నం) ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సృ్మతీ ఇరానీ
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్
Published date : 02 Oct 2019 04:51PM

Photo Stories