నమస్తే ట్రంప్‌ను ప్రభుత్వం నిర్వహించలేదు
Sakshi Education
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో 2020, ఫిబ్రవరి 24న నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ మార్చి 19న రాజ్యసభకు తెలిపారు.
ఆ కార్యక్రమాన్ని ‘డొనాల్డ్ ట్రంప్ నాగరిక్ అభివందన్ సమితి’ నిర్వహించినట్లు వెల్లడించారు. అహ్మదాబాద్ నగర మేయర్ బిజల్‌బెన్ పటేల్ అధ్యక్షతన ఈ సమితి ఏర్పాటైందన్నారు. ఈ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక బాధ్యత లేదని, ఈ కార్యక్రమంతో నేరుగా సంబంధం ఉన్న అంశాలపై ఎలాంటి ఖర్చు చేయలేదని మంత్రి పేర్కొన్నారు.
Published date : 20 Mar 2020 05:58PM