నమస్తే ట్రంప్ పేరుతో మోదీ, ట్రంప్ కార్యక్రమం
Sakshi Education
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతెరా(అహ్మదాబాద్)లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టే తొలి కార్యక్రమం ‘కెమ్ ఛో ట్రంప్’ పేరును ‘నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్’గా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం ఫిబ్రవరి 16న నిర్ణయించింది.
ఇంగ్లిష్‌లో హౌ డూ యూడూ అనే అర్థం వచ్చేలా గుజరాతీ భాషలో కెమ్ ఛో (ఎలా ఉన్నారు? ట్రంప్) అని పేరు పెట్టారు. కానీ అది స్థానిక భాషలో ఉండడంతో ఒక ప్రాంతానికి పరిమితమైనట్టుగా ఉంది. అగ్రరాజ్యాధిపతి పాల్గొనే ఆ కార్యక్రమానికి జాతీయ భావాన్ని తలపించడం కోసం కేంద్రం ఆదేశాల మేరకు నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్ అని మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. 2019 ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ తరహాలోనే ‘నమస్తే ట్రంప్’ జరగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నమస్తే ట్రంప్ పేరుతో మోదీ, ట్రంప్ కార్యక్రమం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : గుజరాత్ ప్రభుత్వం
ఎక్కడ : మోతెరా క్రికెట్ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నమస్తే ట్రంప్ పేరుతో మోదీ, ట్రంప్ కార్యక్రమం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : గుజరాత్ ప్రభుత్వం
ఎక్కడ : మోతెరా క్రికెట్ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్
Published date : 17 Feb 2020 06:07PM