Skip to main content

నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్‌?

వివిధ రంగాలకు చెందిన అన్నిరకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు ‘డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ తెలంగాణ’(డీట్‌) యాప్, పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది.
Current Affairs ఉద్యోగాల వేటలో ఉన్నవారు తమ అర్హతలు, నైపుణ్యం, అనుభవం తదితరాలను ‘డీట్‌’లో నమోదు చేసుకుంటే వారికి ఉద్యోగ ఖాళీల సమాచారం అందుతుంది. అలాగే ఉద్యోగార్థుల అర్హత వివరాలను కూడా డీట్‌లో నమోదైన ఉద్యోగ కల్పన సంస్థలకు చేరవేస్తుంది. ఉద్యోగార్థులు, ఉద్యోగ కల్పన సంస్థలు అనుసంధానం అయ్యేందుకు ఇదో మంచి వేదిక అని అధికారులు చెబుతున్నారు.

ఈక్విఫాక్స్‌తో భాగస్వామ్యం..
డీట్‌ వేదిక ద్వారా షేర్‌ చేసే ఉద్యోగాల సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్జూమర్‌ క్రెడిట్‌ రిపోర్టింగ్‌ ఏజెన్సీ ‘ఈక్విఫాక్స్‌’తో తెలంగాణ ఐటీ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ తెలంగాణ(డీట్‌) పేరుతో యాప్, పోర్టల్‌ రూపకల్పన
ఎప్పుడు : జూన్‌ 16
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : వివిధ రంగాలకు చెందిన అన్నిరకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు
Published date : 17 Jun 2021 08:45PM

Photo Stories