నిరంకారీ మైదానం ఏ భారత నగరంలో ఉంది?
Sakshi Education
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని న్యూ ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తొలిరోజు అడ్డుకున్న ప్రభుత్వం రెండోరోజు నవంబర్ 27న దిగి వచ్చింది.
రైతులు శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్దదైన నిరంకారీ మైదానంలో ధర్నా నిర్వహించారు. సాగును కార్పొరేట్లకు అప్పగిస్తూ రైతులను దగా చేసే కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు
రైతులతో చర్చించేందుకు సిద్ధం
రైతులతో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రైతన్నలు ఆందోళన విరమించుకోవాలని కోరారు. డిసెంబర్ 3న జరిగే భేటీకి రైతు నేతలను ఆహ్వానించామన్నారు.

Published date : 28 Nov 2020 06:00PM