Skip to main content

నిక్లోసమైడ్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన సంస్థ?

నులిపురుగులను నియంత్రించే నిక్లోసమైడ్‌ ఔషధాన్ని కరోనా చికిత్స నిమిత్తం లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో సీఎస్‌ఐఆర్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించింది.
Current Affairs ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులపై నిక్లోసమైడ్‌ ఎంతమేర సమర్థంగా పనిచేస్తుంది, భద్రత తదితరాలు అంచనా వేయడానికి పలు అధ్యయనాలు చేపట్టారు. గతంలో పెద్దలు సహా పిల్లలకు కూడా నులిపురుగు (టేప్‌–వార్మ్‌) నివారణకు నిక్లోసమైడ్‌ విస్తృతంగా వినియోగించేవారు.నిక్లోసమైడ్‌ రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స అందుబాటులోకి వస్తుందని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి మాండే జూన్ 6న తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : నిక్లోసమైడ్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : జూన్6
ఎవరు : లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో సీఎస్‌ఐఆర్‌
ఎందుకు : ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులపై నిక్లోసమైడ్‌ ఎంతమేర సమర్థంగా పనిచేస్తుందని...
Published date : 07 Jun 2021 07:29PM

Photo Stories