Skip to main content

నీతి ఆయోగ్ పాలక మండలి చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం 20న పునర్‌వ్యవస్థీకరించింది. పాలక మండలి చైర్మన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు.
Current Affairsసీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రతినిధులు పాలక మండలిలో ఫుల్‌టైమ్ సభ్యులుగా ఉంటారు. అండమాన్ నికోబార్ దీవులు, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తారు. సాధారణంగా దేశ ప్రధాని నీతి ఆయోగ్ చైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ రాజీవ్ కుమార్ ఉన్నారు.

ఆరో సమావేశం...
నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశం ఫిబ్రవరి 20న ఆన్‌లైన్ విధానంలో జరిగింది. కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. తద్వారా దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయొచ్చని అన్నారు.
Published date : 22 Feb 2021 06:10PM

Photo Stories