నెహ్రూ హాకీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
Sakshi Education
జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్(జేఎన్‌హెచ్‌టీ)కు తొలిసారి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ విషయాన్ని జేఎన్‌హెచ్‌టీ సొసైటీ అధ్యక్షుడు సుభాష్ కపూర్ ఆగస్టు 19న వెల్లడించారు. 2021, నవంబర్ 14నుంచి 25 వరకు నగరంలో జరిగే ఈ టోర్నీలో రైల్వేస్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ఇండియా తదితర ప్రతిష్టాత్మక 16 జట్లు పాల్గొంటాయి. ‘గూంచా గ్రూప్’ టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
తొలిసారి న్యూఢిల్లీ బయట...
దాదాపు ఆరు దశాబ్దాలుగా యువ హాకీ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చి ఒలింపిక్స్ సహా ప్రధాన అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగేలా చేయడంలో నెహ్రూ హాకీ టోర్నీ కీలక పాత్ర పోషించింది. 1964నుంచి జరుగుతున్న ఈ టోర్నీని తొలిసారి న్యూఢిల్లీ బయట నిర్వహిస్తున్నారు.
Published date : 20 Aug 2021 06:35PM